సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి ఆగస్టు 1 ఉ.6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో భీమవరం మునిసిపల్ కమిషనర్ నేడు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో భీమవరం పట్టణంలో 11, 319 మందికి పెంక్షన్ లు ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి , వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సాయంత్రం 6 గంటల లోపు 99%, పూర్తీ చెయ్యాలని 2న 100% పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కావున పింఛను దారులు ఇండ్ల వద్దే ఉండాలని కోరారు. వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు అందనున్నాయి.
