సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ ను ఎంతో చరిత్ర ఉందని, ఈ హాల్లో రెసిడెన్సీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు, బుధవారం ఎల్ హెచ్ టౌన్ హాల్లో న్యూటన్ రెసిడెన్సీ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. రెసిడెన్సీ నిర్వాహకులు మాగపు ప్రసాద్, యర్రంశెట్టి రాజేష్, కత్తుల నిలేంద్ర, రామ్ జీ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రెసిడెన్సీ సరికొత్త హంగులతో ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు,ఎల్ హెచ్ టౌన్ ప్రెసిడెంట్ మెంటే పార్ధసారధి, సెక్రటరి గ్రంధి సురేష్, ఉపాద్యక్షులు కోళ్ల అబ్బులు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, మల్లినిడి తిరుమలరావు, వబిలిశెట్టి రామకృష్ణ, నల్లం చిట్టిబాబు, కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
