సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో భీమవరం పట్టణ ప్రజలకు సుపరిచితులు రెండో పట్టణం, భీమవరం రూరల్ సిఐగా పనిచేసిన జయసూర్య చాల కాలం తరువాత తిరిగి భీమవరం జోన్ నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన డిఎస్పీగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా నేడు, శుక్రవారం కలిశారు. నూతన డిఎస్పీగా నియమితులైన జయసూర్య ను అభినందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. మీకు ఈ ప్రాంతం పరిస్థితులు ఫై గతంలోనే అనుభవం .అవగాహన ఉంది . ఇప్పుడు మీరు మరింత పెద్ద హోదాలో ఇకపై అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్ట పరంగా పరిష్కరించాలని శాంతి భద్రతల అదుపు చెయ్యడంలో రాజీపడొద్దని అన్నారు.
