సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాజీ సీఎం, స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా అవతరించిన ఆరోగ్యశ్రీ పధకం ఎన్నో లక్షల మంది ప్రాణాలు నిలుపుతూనే ఉంది. .. ప్రస్తుతం దేశానికే మార్గదర్శకం అయ్యింది. ఇది కాదననలేని సత్యం. అయితే ఇటీవల ఏపీలో జరుగుతున్నా పరిణామాలు గమనిస్తే త్వరలో ఆరోగ్యశ్రీ స్థానంలో కేంద్ర ప్రభుత్వ పధకం ఆయుష్మాన్ భారత్ అమలు లోకి రనున్నదని స్వష్టం అవుతుంది. ఇప్పటికే దీనిపై కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం ద్రుష్టి సారించింది. దీనిని మరోసారి పరోక్షంగా మరోసారి సమర్ధిస్తూ నేడు, శనివారం నాడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని కేంద్ర టీడీపీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. జీజీహెచ్‌లో సిటీ స్కాన్ సెంటర్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ మంచి ఫలితాలు ఇచ్చిందని అయితే పేదలకు వైద్య సహాయంలో ఇటీవల కొన్ని ఇబ్బందులు కు గురి అవుతుందని ఇది సరిచేస్తామని , దేశంతో పాటు ఏపీలో కూడా ఆయుష్మాన్ భారత్ త్వరలోనే నూతన విధానాలతో అమలు చేయనున్నామని ప్రకటించారు.
