సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కు జన్మదినం నేపథ్యంలో ఆయన నేడు, ఆదివారం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. (శ్రీవారికి తలనీలాలు సమర్పించుకొన్నారు.) తదుపరి ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లోనూ ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కేటాయించారని, ఇచ్చిన హామీ మేరకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ ప్రజల కష్టాలు మరిన్ని తీరనున్నాయని అన్నారు. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతోపాటు కొత్త పరిశ్రమలను సైతం ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్రానికి నరసాపురం పార్లమెంట్ ప్రజలకు కేంద్ర ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రకటించారు.
