సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) విమర్శించారు. వీరవాసరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యరకరాజు సత్య హరిహరరాజు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు డి నాగ శివ ఆధ్వర్యంలో గవరపాలెం, కొణితివాడ గ్రామాలలో నిర్మించిన జనసేన పార్టీ జండా స్థూపం, ఎన్డీఏ కూటమి కార్యాలయాలను ఎమ్మెల్యే అంజిబాబు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య దర్శి కోళ్ల నాగేశ్వరరావు, మండలం జనసేన పార్టీ జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
