సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో వైసీపీ క్యాడర్ ను ఉద్దేశించి పిల్లి సుభాష్ చంద్రబోస్, విజయసాయి రెడ్డి వంటి రాజ్యసభ సభ్యులు తాము జగన్ తోనే ఉంటామని ప్రకటించగా.. నేడు, మధ్యాహ్నం మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ వారిని ఎంతమంది నేతలను టీడీపీ లో చేర్చుకొన్న జగన్ ను అంగుళం కూడా చంద్రబాబు కదపలేరని, ఎన్నికల్లో ఓటమి వల్ల ఏ పార్టీ పని అయిపోదన్నారు.వైసీపీ ప్రజలు నుండి పుట్టిన కార్యకర్తల పార్టీ అని, చంద్రబాబు ల ఎవరో పార్టీ పెడితే దొంగిలించిన పార్టీ కాదని , ఎదో పార్టీ ఆసరా లేకుండా చంద్రబాబు టీడీపీ ని అధికారంలోకి ఎప్పుడు తీసుకొనిరాలేదని అన్నారు. జగన్‌ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ,చంద్రబాబు నమ్ముకొన్న వాళ్ళను మోసం చేసే రాజకీయ ఆషాఢ భూతి అని.. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు పైకి నిజాయితీ పరుడిలా మాట్లాడుతున్నారని, . 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని, అప్పట్లో ముగ్గురు వైసీపీ ఎంపీలు గెలిచాక ప్రమాణ స్వీకారం చెయ్యకుండానే టీడీపీ లో చేర్చుకొన్నారని, 23 మంది వైసీపీ ఎమ్మెల్యలను రాజీనామాలు చెయ్యకుండానే చేర్చుకోలేదా? వారిలో 4గురుని మంత్రులను చెయ్యలేదా? ప్రశ్నించారు. చంద్రబాబు జన్మ లో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలేదన్నారు.ఇటీవల విశాఖ, ప్రకాశం , బెజవాడలో కార్పొరేటర్లు, మేయర్లు రాజీనామా చేయకుండా ఎలా కండువా
కప్పుకున్నారని ప్రశ్నలు గుప్పించారు.
