సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ కొత్త పాలసీ తో మద్యం దుకాణాలను ప్రెవేటు పరం చేసే ఉద్దేశ్యం… ఆయా మీడియా లలో జరుగుతున్నా ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బందిని రోడ్డున పడవేయవద్దని మద్యం యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్వష్టత ఇవ్వకపోతే ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్ పిలుపునివ్వడం జరుగుతుందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. తమకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరుతున్నారు.. కొత్త ప్రభుత్వం వచ్చింది. తమకు మంచి జరుగుతుందని భావిస్తుంటే ఉన్నది కూడా పోయే విధంగా నూతన పాలసీ కనపడుతుందని నిజానికి తమకు కనీస వేతనం కూడా సమయానికి అందడంలేదని, పీఎఫ్, ఈఎస్‌ఐలతో పాటు ఓటీలు కూడా అందటం లేదని వాపోయారు.
