సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువ హీరో రామ్ పోతినేని, డైరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఈ సినిమా మొన్న ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చి.. మిక్స్‌డ్ స్పందనను రాబట్టుకుంది. సినిమా వచ్చి 3వారలు ముగియకుండానే ఎటువంటి హడావిడి లేకుండా తాజగా.. సడెన్‌గా ఓటీటీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిందీ చిత్రం. ఇదేం ఊహించని ట్విస్ట్ అన్నట్లు అమేజాన్ యూజర్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ సరసన హాట్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బుల్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించారు
