సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యాంగ్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సెప్టెంబర్ 27న విడుదలకాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపుందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు, మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ‘దేవర’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల సమక్షంలో ఘ‌నంగా విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో 2 నిమిషాల 35 సెక‌న్లు ఉన్న ఈ ట్రైల‌ర్ మాస్ ఎలిమెంట్స్ తో భారీ యాక్ష‌న్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్లు కనపడుతుంది.ట్రైల‌ర్‌ విషయానికి వస్తే.. తీర‌ప్రాంతంలో భైరా (సైఫ్ అలీఖాన్‌) ఓ క్రూర‌మైన గ్యాంగ్‌తో ఆకృత్యాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఆ ముఠా అక్క‌డ‌కొచ్చే ఓడ‌ల‌ను దోచుకోవ‌ట‌మే కాకుండా, కోస్ట్ గార్డుల‌ను కూడా చంపేస్తూ ర‌క్త‌పాతాన్ని సృష్టిస్తుంటారు. ‘దేవర’ (ఎన్టీఆర్‌). ఆ గ్రామాన్ని పెను ప్ర‌మాదం నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *