సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉండి నియోజకవర్గం లోని ఒక పంక్షన్ హాలులో టీడీపీ, బీజేపీ, జనసేన నేతల ఆత్మీయ సమావేశం స్థానిక ఎమెల్య రఘురామా కృష్ణంరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హాజరు అయ్యారు. కూటమి నేతలు కార్యకర్తల అందరి సహకారంతో ఉండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమెల్య రఘురామా కృష్ణంరాజు పేర్కొనగా, ఉండి నియోజవర్గాము లో కేంద్ర సహకారంతో జరుగుతున్నా ప్రధాన రోడ్ల నిర్మాణం ఫ్లై ఓవర్లు అతి త్వరలో పూర్తీ చేస్తామని ఇంకా ఇతరత్రా అభివృద్ధి కి కేంద్ర నిధులను సమకూర్చడానికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని,ఉండి లో స్థానిక ఎమ్మెల్యేగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ..గతంలో కూడా ఎంపీగా రఘురామా ఉండి కి అభివృద్ధి నిధుల కేటాయింపులో చాల కృషి చేసారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.ఇటీవల ఆకివీడు వద్ద వరదలతో పొంగి పొరలుతున్న కొల్లేరు సరస్సుకు అవుట్ లెట్ గా ఉన్న ఉప్పుటేరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకొనివెళ్ళతానని అన్నారు. ఉత్సహపూరిత వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది.
