సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు, శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వైసీపీ క్యాడర్ వేలాదిగా తరలివచ్చి పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమెల్య వంగా గీత, మాజీ మంత్రి కన్నబాబు తో కలసి ఏలేరు వరద ముంపు బాధిత గ్రామాల ల్లో పరామర్శిం చిన అనంతరం జగన్ మీడియా తో మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని, పెద్ద ఎత్తున పంట నష్టం, అస్తి , ప్రాణ నష్టం జరిగాయని వరద బాధితులు కు ఇప్పుడు జగన్ ఉండి ఉంటె.. అన్న భావన కలిగిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కర్ వచ్చి 4 నెలలు గడుస్తున్నా ..వారి అసమర్ధత వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నా , వరదలు వచ్చిన, గతంలో కరోనా వచ్చిన అన్నిటికి కారణం జగన్.. జగన్ అంటూ చంద్రబాబు తన నామ స్మరణ చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాడని .. రాష్ట్రంలో నీకు 15వేలు.. నీకు 18 వేలు, రైతుకు భరోసా 20 వేలు , 40వేలు అంటూ రాష్ట్రంలో చిన్న పిల్లల నుండి మహిళలు రైతులను అన్ని రకాలుగా మోసాలు చేసి ఏది ఇవ్వకుండా నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబే నని విమర్శించారు. రాష్ట్రంలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ లను నాశనం చేసారని ,రైతులకు పెట్టుబడి సాయం చేయడంలేదు. రైతులకు పంటల బీమా ప్రీమియమ్ కూడా కట్టడం మానేశారని ఇప్పుడు నష్టపోయిన పంటకు భీమా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు జగన్.. పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్ మాత్రమే నని ఆయనకు పాలన గూర్చి ఏమి తెలియదని, చంద్రబాబు మాత్రం పెద్ద డ్రామా ఆర్టిస్టు అని విమర్శించారు.
