సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలంగాణాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్.. నేపథ్యంలో దానిని ఎదిరిస్తూ బిఆర్ ఎస్ అమలు చేస్తున్న ఎదురుదాడి ప్యూహాలు రాష్ట్రంలో ఉద్రిక్తలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుండి తిరిగి వచ్చిన కేటీఆర్ నేడు, శనివారం ఉదయం బిఆర్ ఎస్ ఎమ్మెల్యే కోషిక్ రెడ్డి నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించిన తదుపరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాటలు తూటాలు పేల్చారు.. ఆయన మాటలలలో.. ‘6 గ్యారెంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కారు.. 2లక్షల ఉద్యోగాల పేరిట యువతను మోసం చేశారు.. రుణమాఫీ పేరున రైతులను మోసం చేశారు.. అటెన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రోజుకో ఇష్యూను తెరపైకి తెస్తున్నారు. బజారు మాటలు, చిల్లర మాటలు, చిల్లర వేశాలు. రాజకీయాలు అంటేనే ప్రజలకు అసహ్యం వేసేలా చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి BRSఎమ్మెల్యేలను కలిసి బ్రతిమాలుకుని ఆయనే కండువా కప్పుతారు. ఆయనే ఎమ్మెల్యేల కాళ్ళు పట్టుకుని ఆయనే చేర్పించుకుంటారు. బీఆ ర్ ఎస్ ఖాళీ అవుతుందని గొప్పలు పోతారు.. కోర్టు తీర్పు తర్వాత మళ్ళీ మాట మార్చారు అని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడాడు?.మా పార్టీ మారిన గాంధీని పీఏసీ చైర్మెన్‌గా రేవంత్ రెడ్డి నియమించారు.కౌశిక్ రెడ్డి ఇంటిపై ఫ్యాక్షన్ తరహాలో ‘గుండాలతో దాడి చేశారు. రూమ్ అద్దాలు పగలగొట్టారు. ఈ దాడికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరు. నువ్వు చిట్టి నాయుడివి.. నీలాంటి బుల్లబ్బాయిలను చాలా మందిని చూశాము. నువ్వు ఏం చేయలేవు. . నీ దుష్ట సంప్రదాయాలు కచ్చితంగా నిన్ను చుట్టుకుంటాయి.’ అని కేటీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *