సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుసగా లాభాలులో దేశీయ సూచీలు రికార్డుల దిశగా దూసుకొనిపోతున్నాయి. అంతర్జాతీయంగా పలు సానుకూల సంకేతాలు నెలకొనడంతో ఇది సాధ్యం అయ్యింది. నేడు, మంగళవారం సెన్సెక్స్ 83 వేల పైన క్లోజ్ అయింది. నిఫ్టీ 25, 400 పైన రోజును ముగించింది.గత సోమవారం ముగింపు (82, 988)తో పోల్చుకుంటే స్వల్ప లాభంతో 83, 084 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. ఒక దశలో 120 పాయింట్లకు పైగా కోల్పోయి 82, 866 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మంగళవారం సెన్సెక్స్ 82, 866-83, 152 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 90 పాయింట్ల లాభంతో 83, 079 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. దాదాపు 30 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. చివరకు 34.80 పాయింట్ల లాభంతో 25, 418 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్‌లో మహానగర్ గ్యాస్, ఐజీఎల్, హీరో మోటోకార్ప్, బిర్లా సాఫ్ట్ షేర్ల లాభాలు సంపాదించాయి.. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.75గా ఉంది
