సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో నేడు, గురువారం ఉద్యమ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ” ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే అందరూ ఆరోగ్యవంతమైన జీవితం సాగించవచ్చని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ వంద రోజులు ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. ఫించన్ రూ 4 వేలకు పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు వంటి హామీలను అమలు చేయడంతో పాటు రైతులకు బకాయిలు విడుదల చేసిందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమా న్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరైందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, సామాజిక పింఛన్ల మొత్తం పెంపు, తదితర హామీలను అమలు చేశామన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, బీజేపీ కాయిత సురేంద్ర, జనసేన టీడీపి బిజెపి నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
