సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR సినిమా తరువాత 3 ఏళ్ళ నిరీక్షణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర: పార్ట్-1. నేడు శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ కు జంటగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో ,శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాం త్, కీలక పాత్రలలో అనిరుధ్ సంగీత జోరుతో ఎన్టీఆర్ సోదరుడు హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా అగ్రదర్శకుడు కొరటాల శివ కసితో తీసాడని భావిస్తున్న ” దేవర’ కధ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్న గిరి ప్రాంతంలో ఓ కొండపై ఉన్న కొన్ని గ్రామాలను కలిపి బ్రిటిష్ పాలకుల కాలం నుండి ఎర్ర సముద్రం అని పిలుస్తుం టారు. అక్కడి గ్రామాల ప్రజల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) వాళ్ల సహచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకొంటూ ఉంటారు. వారికీ మురుగ గ్యాంగ్( మురళీధర శర్మ) సహకరిస్తుంది. ఇలా ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తెస్తాయని తెలుసుకొన్న దేవర ఇక ఆ పనులు మానుకొని చేపల వేటపై ద్రుష్టి పెడతాడు. అయితే భైర దానికి అంగీకరించక ఏకంగా దేవరను అడ్డు తొలగించాలని చూస్తుంటాడు. ఇలా సాగుతున్న కధ కు క్లయిమాక్స్ లో బాహుబలి తరహాలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దర్శకుడు. ఇక సినిమా ఎలాఉండటే.. చూసే ప్రేక్షకుడు కధలో లీనమౌతాడు.. సముద్ర నేపథ్యంలో అదో అనుభూతి ప్రేక్షకులకు వెంటాడుతుంది. ఇక ఎన్టీఆర్ ద్విపాత్రాభినయానం మరో హైలైట్ .తన నట విశ్వరూపం చూపించాడు. పోరాటాలుకు చాల కష్టపడ్డారు ప్రకాష్ రాజు కధ వినిపిస్తూ నడిపిస్తుంటారు.. . హీరోయిన్ జాన్వీ కపూర్ చక్కగా చేసింది. పాటలలో రొమాన్స్ కుదిరింది.ఆయుధ పూజ పాట హైలైట్. ఇక నటీనటులు అందరు పర్ఫెక్ట్.. ఇంటర్వెల్ ముందు సినిమాకు వంక పెట్టలేము కానీ అయితే క్లయిమాక్స్ ట్విస్ట్ అసంతృప్తి కలింగించే అవకాశం లేకపోలేదు. గ్రాఫిక్, సిజె వర్క్ క్వాలిటీపై మరింత శ్రద్ద పెట్టి ఉండవలసింది. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదుర్స్ అంతే .. లాజిక్ ఆలోచించకుండా చూసే ప్రేక్షకులకు పండగే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *