సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం బుధవారం మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద ఒక చిన్న మురుగు కుంట ఉండటం అందులో నాలుగు రోజులు క్రితమే ఒక ఆవు దూడ పడిపోయి మునిగిపోయి చనిపోయింది. ఈరోజు ఆదివారం అది పైకి తేలడం జరిగింది అక్కడ చూసిన వాస్తవ్యులు గో సంరక్షణ అధ్యక్షులు సుంకరదాసు కు సమాచారం అందించారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆవు వద్దకు వెళ్లారు విపరీతమైన దుర్వాసన తో దగ్గరకు కూడా వెళ్ళని పరిస్థితిలో ఆ ప్రదేశం ఉన్నది మునిసిపల్ కమిషనర్ గారు రామచంద్రారెడ్డి కి సుంకరదాసు ఫోను చేసి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందిని పంపించారు తరువాత ఆ ఆవుకు అక్కడే ప్రోక్రేన్ సహకారంతో గుంత త్రవ్వి, శాస్త్ర బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుంకరదాస్ అశోక్ యాదవ్ వెలమామని మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. హైందవ ధర్మం గురించి మాటలు కాదు చేతలలో చూపిన ఆ యువకులను స్థానికులు అభినందించారు.
