సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన టీడీపీ జనసేన పార్టీలకు ఏపీలో అసెంబ్లీ సీట్లు మినహా శాసనమండలి లో కానీ స్థానిక సంస్థలు కానీ, సిటీలు మున్సిపాలిటీ లు అన్ని ఏక పక్షముగా వైసీపీ ప్రజా ప్రతినిధులతో నిండిపోవడం పాలనకు పెద్ద లోటుగా మారిపోయింది. అక్కడికి అక్కడక్కడ ఆకర్ష .. ప్రభావం తో కొందరు వైసీపీ నేతలు టీడీపీ జనసేన లోకి వస్తున్నారు. అయితే మరి ఇబ్బందికర విషయం రాజ్యసభలో ఎదురయింది. అక్కడ ఏపీ కోటాలో 11 కు 11 మంది వైసీపీ ఎంపీలు ఉండటంతో సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు చాణుక్యత పనిచేసింది. ఏమి ఆశ పడ్డారో?కానీ ముగ్గురు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు ‘కూటమి కోసం ఏకంగా తమ ‘ఎంపీ’ పదవులను త్యాగం చేస్తూ .రిజైన్ చేశారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు సీట్లు కు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలంగా ఉన్న టీడీపీ కూటమికే దక్కనున్నాయి. టీడీపీకి దక్కే స్థానాల కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్,యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా తాజగా జనసేన తరపున మెగా బ్రదర్ , నాగబాబు పేరు పరిశీలన లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కి కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జనసేన అభిమానులకు ఇది శుభవార్తగానే పేర్కొనాలి.
