సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో సీఎం చంద్రబాబు వృద్దులకు నెలకు 4వేలు చప్పున వికలాంగులకు 6వేలు చప్పున ఎన్టీఆర్‌ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భముగా అయన ప్రజలతో మాట్లాడుతూ.. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పాలనంతా గాడి తప్పింది. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వడ్డీనే రూ.లక్ష కోట్లు అవుతోంది గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. దీపావళి నుంచి ఏటా ఇంటికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తాం. అన్న క్యాంటీన్లు 175 పెట్టాం. ఒకేరోజు 11,320 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాలని మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఆలోచించారు. ఇది మంచి ఆలోచన అని చెప్పి ముందుకెళ్లాం. దేశంలోనే ఇదో రికార్డు. పల్లె అభివృద్ధికి రూ.990 కోట్లు ఇచ్చాం. ఎన్ని కష్టాలు ఎదురయినా ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *