సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో ప్రభుత్వ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్‌ ? అయ్యారు. లాబీయింగ్‌లతో రాజకీయ పార్టీలకు అతీతంగా టీడీపీ జనసేన, వైసీపీ బీజేపీ పార్టీలలోని నేతలు కొందరు మద్యం వ్యాపారులంతా ఒక్కటై తమ పార్టీ రాజకీయాలు ప్రక్కన పెట్టి సిండికేట్లకు రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సిండికేట్ లలో కీలక భూమికలు మాత్రమే టీడీపీ మద్దతు దారులే పోషిస్తున్నారు అని భావిస్తున్నారు. ఇందులో వారి తరపున కొందరు బినామీ లు లైసెన్స్ పీజు చెల్లింపులలో కధ నడుపుతున్నారు. అందుకే ఉమ్మడి గోదావరి జిల్లాలలో మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలకు ఎక్కువ పోటీ పెరగకుండా ఒక ప్యూహం ప్రకారం చాల స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు దాఖలైనట్టు సమాచారం.దీంతో మద్యం నుంచి ప్రభుత్వం ఆశించినంత లిక్కర్ లైసెన్స్ ఫీజుల రూపంలో వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలతో ఈ నెల 1వ తేదీ నుంచి మద్యం షాపులకు అప్లికేషన్స్‌ స్వీకరిస్తున్నారు. అయితే ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ గడుపు ఉంది. రానున్న 2 రోజుల గడువులో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఈ నెల 11వ తేదీన శుక్రవారం జిల్లాల కలెక్టర్లు సమక్షంలో దుకాణాల కేటాయింపులపై లక్కీ డ్రా తియ్యనున్నారు.. ఎక్కడికక్కడే షాపుల కోసం ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొందరు ప్రముఖులు ఈసారి మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే శుక్రవారం లక్కీడ్రాలో ఎంపికైన విజేతలు విజయదశమి రోజున మద్యం దుకాణాలు ప్రారంభించుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *