సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ లో ఇప్పటికి నేతలు లేకపోయిన బలమైన క్యాడర్ ఉన్న తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకోని వచ్చేందుకు వుహ్యరచన జరుగుతుంది. అధికార కాంగ్రెస్ లో చేరిక కష్టం అయిన కొందరు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు టీడీపీ వైపు చూపులు చూస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నేడు, సోమవారం సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‎లోని‎ చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్‎గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో చర్చించారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ప్రశంసల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *