సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కాపు ( కోపా ) కల్యాణ మండపంలో జరిగిన విశ్వబలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పు కాపు సంఘాల సమాఖ్య సమావేశంలో స్థానిక జనసేన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొని దాతల సహకారంతో 70 మంది పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పలువురు కాపు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భముగా అంజిబాబు మాట్లాడుతూ.. వచ్చే 2029 ఎన్నికలలో కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ 2034 లో మాత్రం ముఖ్యమంత్రి కాపులేనని అన్నారు. మన కాపులు కాపులు సహకరించుకుంటేనే జాతి అభివృద్ధి సాధ్యమని, పట్టుదల కృషి దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చనని, కాపులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. తోటివారికి సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరొకటి ఉండదని అన్నారు. పేదవారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో కుట్టు మిషన్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను చేయడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, కోపా అధ్యక్షులు యర్రంశెట్టి హరినాథ్ రావు, కార్యదర్శి అరేటీ సత్యనారయణ, జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్, యిర్రింకి సూర్యారావు, పీవీ రావు, కృష్ణారావు, కారటం రాంబాబు, గంధం సత్య శేఖర్, అల్లం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాబ్జీ, నల్లం చిట్టిబాబు, యర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
