సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉదయం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాంప్ కార్యాలయంలో భీమవరం డిఎన్నార్ విద్యాసంస్థలకు స్కూల్ విద్యార్థులు సేకరించిన రూ లక్ష 59 వేలు, కళాశాల యాజమాన్యం రూ లక్ష కలపి ఒకే మొత్తంగా రూ 2 లక్ష 50 వేలను ఎమ్మెల్యే అంజిబాబుకు సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. మొదటి నుంచి కూడా డిఎన్నార్ కళాశాల యాజమాన్యం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తూ ఉందని, భోజన ప్యాకెట్స్ కూడా పంపించారని ఇప్పడు సహాయనిది కూడా ఇవ్వడం అభినందనీయం అన్నారు. .ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, జాయింట్ సెక్రటరీ కూనపరాజు రామకృష్ణంరాజు, పీ రామకృష్ణంరాజు, స్కూల్ ప్రిన్సిపాల్ చదలవాడ నిర్మల, ఎస్ సిహెచ్ బీఆర్ఏం హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, రాట్నల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
