సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హర్యానాలో కూడా మన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మాదిరే ప్రజల మనోభిష్టానికి, ఎన్నికల సర్వే లకు బిన్నంగా ఎన్నికలలో బీజేపీ గెలవటం ఫై పలు భావనలు వ్యక్తం అవుతున్నాయని అందుకే ఎన్నికలలో EVM లకు బదులు పేపర్ బ్యాలట్ లను తిరిగి ప్రవేశపెడితే ఇటువంటి అనుమానాలకు చెక్ పెట్టినట్లు ఉంటుందని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నేడు, బుధవారం జగన్ మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ప్రస్తుత కూటమి పాలనలో అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వానలని.. ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేను చేయొద్దని చెప్పినా రెడ్‌బుక్ అనేది ఏమైనా పెద్దపనా?.. ఎప్పుడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చిందని విమర్శించారు. ‘‘ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు. .అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం’’ అని అన్నారు. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామని వారికి మేము అధికారంలోకి వచ్చాక తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయన్నారు.‘‘ రాష్ట్రానికి పాలనా బాగోలేదు. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. నన్ను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం’’ అని జగన్ పేర్కొన్నారు.
