సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నా నేపథ్యంలో నేడు, గురువారం విశిష్ట దుర్గాష్టమి కి శ్రీ అమ్మవారికి శ్రీ దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ దుర్గ అమ్మవారిని జిల్లా కలెక్టర్ నాగరాణి తో, వారి కుటుంబసభ్యులతో సహా వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి ఈలంపూడి కి చెందిన అల్లూరి రవి కుమార్ రాజు లక్ష్మి దంపతులు 16 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం అందజేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం3 నుండి రాత్రి 9 గంటల వరకు ఆహూతులకు చక్కటి ఏర్పాట్ల మధ్య జరుగుతున్నా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను, కళాభిమానులును విశేషంగా అలరిస్తున్నాయి.
