సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయదశమి కానుకగా విశ్వం సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే గత 5 ఏళ్లుగా పరాజయాల పరంపర కొనసాగిస్తున్న హీరో గోపీచంద్, ఒకనాటి అగ్ర దర్శకుడు శ్రీను వైట్లకు ఇద్దరికీ ‘విశ్వం’ పెద్ద అగ్ని పరీక్షే… మంచి కసితో పనిచేసి హిట్ కొడతారని ప్రేక్షకులు భావిస్తారు. మరి వారి అంచానాలు ఈ సినిమా అందుకొందా ? ఒక రకంగా ” దూకుడు” సినిమా కథను పోలి ఉన్న ఈ సినిమా కధ విషయానికి వస్తే..టెర్రర్టిస్ట్ అయిన జలాలుద్దీన్ ముహమ్మద్ ఇండియాలో అజయ్ శర్మగా సెటిల్ అయ్యి.. వరుస బాంబ్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో కేంద్రమంత్రి సుమన్‌ (సుమన్)ని అతని తమ్ముడు బాచిరాజు (సునీల్) సాయంతో చంపేస్తాడు. అయితే ఆ హత్యను దర్శన అనే చిన్నారి చూస్తుంది. అప్పటి నుంచి దర్శనను చంపడానికి ఈ టెర్రరిస్ట్ ప్రయత్నిస్తాడు. ఆ చిన్నారి సమైరా (కావ్యా థాపర్) అన్న కూతురు కావడంతో.. ఆమెను కాపాడటం కోసం రంగంలోకి దిగుతాడు గోపి రెడ్డి అలియాస్ విశ్వం (గోపిచంద్). ఆ చిన్నారికి కాపాడటం కోసం విశ్వం ఎందుకు వచ్చాడు? యాంటీ టెర్రర్టిస్ట్ స్క్వాడ్‌కి ఇతనికి లింకేంటి? ఆ చిన్నారి ఎలా కాపాడాడు అన్నదే మిగిలిన కథ. ఇక సినిమా ఎలా తీశారు అంటే.. గతం లో శ్రీనువైట్ల సినిమాలలో బాగా పేలిన సన్నివేశాలు, కామిడి సన్నివేశాలకు మరో కొత్త కాంబోలో కిచిడి’ తయారు చేసారు అంతే .. వినోదం వరకు ఓకే అనిపించుకొన్నపటికి ఇది ఒక 6 ఏళ్ళ క్రితం పార్ములా సినిమాగా కనపడుతుంది. ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ.. కామెడీ టచ్ ఇస్తూ ఇంటర్వెల్ వరకూ విశ్వం సాఫీగా సాగిపోయింది. సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, పృథ్వీ, కామెడీ ఇరగదీసారు. ట్రైన్ ఎపిసోడ్ అయితే వెంకీ సినిమాని మరల గుర్తు చేస్తుంది. వెన్నెల కిషోర్ మెప్పించాడు. కమర్షియల్ కోణంలో కామెడీ ట్రాక్‌కి పదును పెట్టి క్యారెక్టర్‌లతోనే కథని నడిపిస్తుంటారు.యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా తనదయిన శైలి లో నటించారు. హీరోయిన్ కావ్య ధాప్చర్ అందాలు విందు చేసింది. ఆమె పాత్ర నిడివి పెద్దగానే ఇచ్చారు.కథని భారీ హంగులతో బాగానే ముస్తాబు చేశారు మొత్తానికి శ్రీను వైట్ల. ఇరగదీశాడని చెప్పలేం కానీ.. డిజప్పాయింట్ అయితే చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *