సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు గత శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలో 3వేల 396 వైన్ షాపులు ఉండగా తాజగా నేడు, శనివారం అధికారిక సమాచారం సమాచారప్రకారం ఇప్పటివరకు 87వేల 116 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5వేల 764 దరఖాస్తులు రాగా, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది.(అందులోను భీమవరం నుండే సింహ భాగం వచ్చాయి) ఇక్కడ 5వేల 362 దరఖాస్తులు వచ్చాయి.మూడో స్థానంలో ఏలూరు జిల్లా ఉంది. ఇక్కడ 5వేల 339 దరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 షాపులకు గాను 5వేల 362 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 144 లిక్కర్ దుకాణాలు ఉండగా.. 5వేల 339 దరఖాస్తులు దాఖలయ్యాయి. అతి తక్కువగా నెల్లూరు జిల్లాలో 1179 దరఖాస్తులే దాఖలయ్యాయి. ఈ నెల 14న లాటరీ తీసి మద్యం షాపులను కేటాయించనున్నారు అధికారులు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి రానుంది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1740 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
