సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ కు వాయు గుండం ప్రమాదం పొంచివుంది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ నేడు, ఆదివారం ప్రకటించింది. రేపు సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 , 17తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రేపు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వెళ్లరాదని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొన్న విజయవాడ వరదలు అలసత్వం నుండి తేరుకున్నరాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలర్ట్ అయ్యింది. వివిధ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. ప్రజలకు అత్యవసర సహాయక చర్యల నేపథ్యంలో విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 నెంబర్ల ను ఏర్పాటు చేసారు.
