సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణది సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరోసారి చేతులు కలిపారు.వరుసగా ఒకదానిని మించి మరో భారీ హిట్స్ అందించిన ఘన చరిత్ర వీరిది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్- ‘సింహ, లెజెండ్ మరియు అఖండ’ చిత్రాల తర్వాత నాల్గవసారి వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. వీరి గత సినిమా ‘అఖండ’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కరోనా సమయంలో మూసేసిన థియేటర్స్ ను తెరిపించి సీట్లకు పట్టిన దుమ్ము దులిపించిన సినిమా అఖండ కు ఒక చరిత్ర ఉంది.ఇక వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న నాల్గవ చిత్రం నేడు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇదే సందర్భంలో చిత్ర టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇది ‘అఖండ’‌ (Akhanda)కు సీక్వెల్ అని తెలుపుతూ.. ‘అఖండ 2’ (Akhanda 2) టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.బాలయ్య కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *