సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయుగుండం ప్రభావం తో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు, శనివారం కూడా కొనసాగాయి.నేడు, గురువారం నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకినట్లు వెల్లడించారు. వాయుగుండం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మీదుగా పయనించి శుక్రవారానికి బలహీనపడుతుంది. దీని అవశేషాలు ఈనెల 18న అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. వాయుగుండం ప్రభావంతోపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేకచోట్ల కురుస్తున్న భారీవర్షాలకు ఇప్పటికే వరద తీవ్రత పెరిగింది. ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వాయుగుండం తీరం దాటే సమయంలో బాపట్ల, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోనూ వర్షాలు పెరుగు తాయి. ఇప్పటికే . కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నంలలో మూడు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నంలలో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
