సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అస్తవ్యస్త ప్రభుత్వం నడుస్తుందని , సీఎం గా చంద్రబాబు ఐదు నెలల పాలనలో డీబీటీ అనేది ఎక్కడ కనపడదని.. కొత్తగా ఇసుక పాలసీ, మద్యం పాలసీ ఏది తీసుకొన్న.. దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే కనిపించేదంటూ, టీడీపీ వాళ్ళు బాగుపడటానికి తప్ప ప్రజలకు ఒరిగేది ఏమి లేదని, ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎగ్గొటేశారని వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ లేదు…. సూపర్ సెవన్ లేదంటూ ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఓటు అన్ అకౌంట్‌తో ఇంత కాలం నడిచే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదంటూ విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఇసుక, మద్యం,పేకాట క్లబ్బులు ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా నడుస్తున్నాయని, ఎమ్మెల్యేకు, సీఎంకు ఇంత అంటూ కప్పం కట్టకుండా ఏ పని చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి స్వరం వినపడకుండా చేస్తారు.అని ఆగ్రహం వ్యక్తం చేసారు జగన్.
