సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాల‌కృష్ణ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఆహా లో క్రేజీ ఓటిటి షో .. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 అక్టోబ‌ర్ 25న రాత్రి 8.30 గంట‌ల నుంచి ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు అతిథిగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.అభిమానులు వేరు, బాల‌య్య వేరు కాదు.. అభిమానులు, బాల‌య్య ఒక్క‌రే అంటూ బాల‌కృష్ణ డైలాగ్‌తో ప్రొమో ప్రారంభ‌మైంది. వివిధ గెట‌ప్స్‌లో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. మొద‌ట‌గా చంద్రబాబుతో అన్‌స్టాప‌బుల్ బుక్ పై ప్రమాణం చేయించారు. ఈ సంద‌ర్భంగా మీ చామత్కారం మీది, మా సమయస్ఫూర్తి మాది అని చంద్ర‌బాబు అన్నారు.. ఈ షోలో జైలులో 4 గోడల మధ్య తాను ఎదుర్కొన్న క‌ష్టాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. మొదటి రాత్రి జైలులో ఎలా గడిపానో అలానే 53 రోజులు గ‌డిపాన‌ని చంద్రబాబు చెప్పారు. తప్పు చేసిన వాళ్ళని ఎవ్వ‌రిని వదిలి పెట్టనన‌ని అన్నారు. తాను జైలు గోడలు మధ్య పవన్,పరామర్శ కి వచ్చినప్పుడు నేను రెండు నిముషాలు మాట్లాడుకున్నాం. నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తి గా నిర్ణయం తీసువడానికి ఒక హిస్టరికల్ డే అని చంద్ర‌బాబు అన్నారు.మొత్తానికి ఆసక్తి రేపుతున్న ఈ వీడియో అక్టోబర్ 4నుండి పూర్తిగా చూడవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *