సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగంలో భాగంగా ప్రతి రోజు ఇంటిటికి వెళ్లి పారిశుధ్య కార్మికులు సేకరించిన చెత్త ను తీసుకొనివెళ్లే క్లాప్ వెహికెల్స్ డ్రైవర్స్ ఈనెల 11వ తేదీ నుండి సమ్మె కారణంగా నిలిచిపోయిన నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ కొన్ని వెహికల్స్ ను ప్రవేటు డ్రైవర్స్ తో నిర్వహింప చేస్తున్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం భీమవరం మునిసిపాలిటీ లో పని చేస్తున్న 35 మంది క్లాప్ వెహికెల్స్ యూనియన్ సభ్యులు కలసి తమకు బకాయి పడ్డ 2 నెలలు పైగా జీతాలు ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కు భవినతిపత్రాన్ని అందించారు. ఇటీవల మరలా వెళ్ళి మున్సిపల్ కమీషనర్ గారిని వెళ్ళి అడగగా,, ఆయన .. మీరు విధులకు రాని కారణంగా వేరే ప్రైవేటు ట్రాక్టర్లుతో చేయిస్తున్నాము. మీ డ్రైవర్లు మాకు అక్కర్లేదని అన్నారని,, మా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. యూనియన్ సభ్యులు చెల్లబోయిన రంగారావు, సిహెచ్ కుమార్, రేవు వెంకట రమణ, కేతా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
