సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం రష్యాలోని కజాన్ నగరం వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేడు, మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా, శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తానని మోదీ పునరుద్ఘాటించారు. ఘర్షణ అంశంపై నేను నిరంతరం మీతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాను. శాంతి పునరుద్దరణకు సహకారం అందించేందుకు భారత్ సదా సంసిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.గత మూడు నెలల వ్యవధిలో తాను రెండవసారి రష్యాలో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మీ స్నేహానికి, సాదర స్వాగతానికి, ఆతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కజాన్ నగరంలో భారత కొత్త కాన్సులేట్ ప్రారంభం కావడంతో సంబంధాలు మరింత బలపేతం అవుతాయి’’ అని పుతిన్‌తో మోదీ అన్నారు.
