సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు నేడు, బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకొంటున్నారు. మరి ప్రభాస్ సొంత గడ్డ భీమవరం లో ఇక ఆ సందడి చెప్పనక్కరలేదు. వాడవాడలా ప్రభాస్ కు శుభాకాంక్షలుతో భారీ ఫ్లెక్సీస్ తో పాటు పేదలకు అన్నసమారాధన వస్త్ర దానం, రక్తదాన శిబిరాలల్తో అయన అభిమానులు సందడి చేస్తున్నారు, కాగా, తాజాగా డార్లింగ్ ప్రభాస్ అఫ్కమింగ్ మూవీస్‌లో ఒకటైన రాజాసాబ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అందులో మేకర్స్.అభిమానులు కోరుకొనే ‘యంగ్ డార్లింగ్’ లుక్ లో చాల కాలానికి కనపడ్డారు. గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటు, టీ షర్ట్ ధరించిన యువకుడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ అభిమానులను అలరిస్తోంది. ఇక ప్రభాస్ బర్త్ డే టీజర్‌ను విడుదల చేయనున్నారు. కాగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు కథానాయికలు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
