సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సహన కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం జగన్ నేడు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ఈ 4 నెలల కాలంలో 77 అత్యాచారాలు.. 7గురు మహిళలు హత్యకు గురి అయ్యారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయని అన్నారు. సహన ను కారులో లాక్కెళ్లి చంపిన నిందితుడు టీడీపీ కి చెందినవాడు.. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పైగా నిందితులను కాపాడే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు ఉండటం దారుణం అన్నారు. బద్వేల్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడని , మరో చోట మరో ప్రబుద్దుడు ఇంటర్ చదివే బాలికపై అత్యచారం చేసేందుకు ప్రయత్నించి ఆమెను పురుగుల మందు త్రాగించి చంపేశాడు అన్నారు. పలాసాలో ఇద్దరి బాలికలకు పుట్టిన రోజు పార్టీ అని చెప్పి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి అత్యాచారం చేశారని ధ్వజమెత్తారు. పిఠాపురం లోనూ టీడీపీ కార్పొరేటర్ భర్త 16 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని జగన్ ఆరోపించారు. చెత్త కాగితాలు ఏరుకునే వారు ఆ బాలిక ప్రాణాలు కాపాడారని ఆయన అన్నారు. నిందితుడు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడుతో ఫొటోలు దిగాడంటూ వాటిని మీడియాకు చూపించారు. సొంత నియోజకవర్గంలో ఘటన జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనీసం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించలేదని జగన్ మండిపడ్డారు. అలాగే హిందూపురంలో విజయదశమి పండగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేశారని, ఆ నిందితులను మూడ్రోజుల వరకూ పోలీసులు అరెస్టు చేయలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం బాధితులను పరామర్శించలేదని మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో’దిశ ‘ రక్షణగా ఉండేదని, ఆపద మహిళా ఫోన్ కదిపితే చాలు దిశా పోలీసులు వచ్చేసేవారని ఈ ప్రభుత్వం లో పలికేవారు లేరని విమర్శించారు. రాష్ట్రంలో ఆడవారికి భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేసారు.
