సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప 2 కోసం ప్రపంచము మొత్తం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో నేడు, గురువారం సాయంత్రం మైత్రి మూవీస్ నిర్మాతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనేక విషయాలు తెలిపారు. 6 బాషలలో రూపొందిన పాన్ ఇండియా సీక్వెల్ “పుష్ప 2”. భారీ అంచనాలున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప‌లుమార్లు వాయిదా పడి…ఎట్టకేలకు డిసెంబర్ 6న ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చారు మేకర్స్. పుష్ప 2 సినిమాని డిసెంబర్ 6న కాకుండా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక అదిరే పోస్టర్ తో తెలిపారు. మరి ఇందులో బన్నీ సాలిడ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.పుష్ప 2లో జాతర ఎపిసోడ్‌’. అదొక మాస్టర్‌ పీస్‌గా నిలుస్తోంది దాదాపు 35 రోజులు చిత్రీకరణ చేశాం.పుష్ప 2 గతంలో ఏ ఇండియన్ హీరోకు లేనివిధంగా శాటిలైట్ , ఓటిటి తదితర డిజిటల్ ప్లాట్ పారంలకు మొత్తం కలపి నాన్‌ థియేట్రికల్‌గా 420 కోట్లు బిజినెస్‌ చేశాం. ఇక సినిమా థియేటర్స్ బిజినెస్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అంటున్నారు నిర్మాతలు . మొత్తానికి అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ టేకోవర్ డిసెంబర్ 5 నుంచి ఉంటుంది .. మరి బన్నీ ప్యాన్స్ కు పండుగే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *