సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏడాది కి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణి కార్యక్రమానికి దీపావళి నుండి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో .. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 6.25 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. అయితే అందరికీ ఉచిత గ్యాస్ పథకం వర్తించదు. కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.67 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులున్నారు. ఉచిత గ్యాస్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం ఏటా దాదాపు రూ.170 కోట్లు సబ్సిడీ కోసం జామా చేయనుంది. ప్రతి 4 నెలలకు ఒక గ్యాస్ బండ ఉచితంగా గా ఇస్తారు, కేవలం 48 గంటల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి సొమ్ములు పడతాయని అంటున్నారు. . ఉచిత గ్యాస్ దరఖాస్తు చేసుకోవడానికి 2025మార్చి 31వ తేదీ వరకు అర్హత ఉంటుంది. అంటే 2025 మార్చి నాటికి ఒక్క సిలిండర్ మాత్రమే వస్తుంది.
