సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వై యస్ షర్మిల తన తండ్రి పేరుమీద .. తెలంగాణా వై ఎస్ ఆర్ పార్టీని ఎన్నికల ముందు మూసేసి తెలంగాణ కాంగ్రెస్ లో చేరినాక మరల అప్పుడు వారు షర్మిలను ఏపీకి పంపి ఇక్కడ రాష్ట్ర అడ్జక్షురాలు ని చేసినప్పుడు అన్ని వేళల షర్మిలకు అండగా ఉన్న తల్లి వై ఎస్ విజయమ్మ సాహసోపేతంగా వై యస్ షర్మిల కు ఎన్నికల ముందు కడప ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ను గెలిపించాలని జగన్ వైసీపీ తరపున పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపు నివ్వడం( అయితే అవినాష్ రెడ్డి 70 వేలు పైగా గెలిచారనుకోండి ) అందరికి తెలిసిందే.. అయితే ప్రస్తుతం జగన్ ఆస్తులలో మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్న షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కు కీలక సమయంలో తల్లి విజయమ్మ మరోసారి మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం’’ అని వైఎస్ అనేవారని గుర్తుచేశారు. తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని తన ముందే జరిగిపోతున్నాయని అన్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుందని చెప్పారు. నాకు పుట్టిన ఇద్దరు బిడ్డలు సమానమేనని.. ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచాలని వై యస్ అనేవారని జగన్ దగ్గర మాట కూడా తీసుకొన్నారని, ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం.. అయితే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అసత్యాలు చెప్పారని అన్నారు. అయితే జగన్ ను జైలు కు పంపే ఆలోచనతోనే చెల్లెలు షర్మిల ‘ఈడీ ఎటాచ్ మెంట్ లో ఉన్న జగన్ పేరున ఉన్న ఆస్తులలో’కుట్రతో వేలు పెడుతుందని, వైసీపీ నేతల ఆరోపణపై మాత్రం ఆమె వివరణ ఇవ్వలేదు.
