సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు గురువారం దీపావళి పర్వదినం.. దీపావళి అనగానే ఆబాల గోపాలానికి గుర్తుకువచ్చేది బాణాసంచా కాల్పులు.. దీపపు వెలుగుల సందడి.. ఈ నేపథ్యంలో ఎప్పటి లానే ఈసారి కూడా భీమవరం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో బాణసంచా షాపులు ఏర్పాటు చేసారు. పెద్ద చిన్న కలపి సుమారు 45 షాపుల వరకు ఇదే గ్రౌండ్ లో ఏర్పాటు చేసారు. అయితే పెరిగిన ధరలు దృష్ట్యా గత ఏడాది తరహా వ్యాపారం వేగంగా జరగటం లేదు. ప్రజలు తమ బడ్జెట్ లో కొనుగోలు చేస్తున్నారు. అయితే నేడు, రేపు గురువారం బిజినెస్ బాగుటుందని భావిస్తున్నారు. నిజానికి గతంలో హోల్ సేల్ & రిటైల్ వ్యాపారం చేసే బాణాసంచా వ్యాపారులు 14 రోజులు ముందుగా షాపులు వేసేవారు . అయితే నిర్వహణ ఖర్చులు పెరగటంతో 7 రోజులు 5 రోజులు లోపు పండగకు ముందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ కు చెల్లించవలసిన లైసెన్స్ పీజులు కూడా చాల మంది రిటైల్ వర్తకులు చెల్లించడం లేదని తెలుస్తుంది. దీనితో పట్టణం మొత్తం మీద 10 లక్షల పైగా లైసెన్స్ పీజు ఆదాయం లోటు వస్తుందని వ్యాపారులు సహకరించాలని CTO అధికారులుకోరుతున్నారు. గత ఏడాది లానే ఈసారి షాపులు అన్ని ఒక క్రమ పద్దతిలో ‘యూ’ ఆకారంలో ఏర్పాటు చేసి మధ్య ఖాళీ గ్రౌండ్ వదిలెయ్యడంతో అటు వాహనాల పార్కింగ్కు కు అనువుగా ఉంది. నాసిరకం బాణసంచా బ్రాండ్ లకు దూరంగా .. దశాబ్దాలుగా నాణ్యత మైన ప్రముఖ బాణాసంచా బ్రాండ్స్ ను పూర్తీ హోల్ సెల్ ధరలకు విక్రయించే .. వరుణ సూపర్ బజారు బాణాసంచా షాప్ నెంబర్ 2 ప్రత్యక ఆకర్షణగా ఉంది.
