సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిల్ రాజు నిర్మాతగా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి బంపర్ హిట్ సినిమాల తరువాత హ్యాట్రిక్ కాంబినేషన్ గా విక్టరీ హీరో వెంకటేశ్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో భారీ అంచనాలతో ఓ సినిమా షూటింగ్ శరవేగంగా హుషారుగా పూర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాగా వచ్చిందని టాక్.. దిల్ రాజు నిర్మాతగా గత 4 ఏళ్లుగా నిర్మిస్తున్న రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజెర్ సినిమా జనవరి 10 న విడుదల చేస్తున్న నేపథ్యంలో.. వెంకీ సినిమా రిలీజ్ ఫై సందిగ్ధత ఏర్పడింది. ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా సంక్రాంతి రావలసిందే న్నాయి.. ఒక దశలో వెంకటేష్ స్వయంగా తన సురేష్ బ్యానర్ ఫై రిలీజ్ కి సిద్దపడుతున్నాడని కూడా ఫిల్మ్ నగర వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి ఈ సినిమా కూడా సంక్రాంతి కి రిలీజ్ కు పిక్స్ చేసారు. తాజాగా నేడు, శుక్రవారం ఉదయం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ చిత్రబృందం విడుదల చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ఖరారు చేసింది. వెంకీ సరసన తొలిసారి యంగ్ హీరోయిన్స్ . మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *