సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని గరగపర్రు రోడ్డులోని బీవీ రాజు విగ్రహం సెంటర్ లోని దసిక గ్యాస్ ఏజెన్సీ వద్ద దీపం 2.0’ ఉచిత గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని నేడు, శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నామని, భీమవరం నియోజకవర్గంలో 81,348 మంది తెల్లకార్డుదారులున్నారని, వారికి ఈ ఉచిత సిలిండర్ ద్వారా ఏడాదికి రూ 15 కోట్లు ఖర్చు అవుతుందని, 5 ఏళ్లలో 75 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. భీమవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని, అన్ని హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు. ఆర్డీవో ప్రవీణ్ మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో ఏమైనా సమాచారం కోసం 1967 నెంబరుకు సంప్రదించవచ్చునని అన్నారు. అనంతరం లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రవి రాంబాబు, దశిక గోపాలకృష్ణ, మరియు స్థానిక టీడీపీ , జనసేన నేతలు పాల్గొన్నారు.
