సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు, శనివారం పరవాడ గ్రామం లో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గుంతలు లేని రోడ్లకు నేడు అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో శ్రీకారం చుట్టామని .. గతంలో గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డారు. గుంతల రోడ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఎంతోమంది చనిపోయారని అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఐదేళ్లలో రహదారుల కోసం కేవలం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.మంచి రోడ్లు నాగరికతకు చిహ్నమని.. అభివృద్ధికి ఆనవాళ్లు మంచి రహదారులు అని పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నారు.
