సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో రేపు సోమవారం అంటే ఈనెల 4న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రొజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు ప్రకటించారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో మేనేజర్, రిటైల్ సేల్స్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్, కెమిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహి స్తారన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్ల మో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35ఏళ్లలోపు అభ్య ర్థులు అర్హులన్నారు. వారికి నెలకు రూ.12వేల నుంచి రూ.25వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్స్లతో కలెక్టరేట్లోని వికాస కార్యాలయం వద్దకు హాజరుకావాలన్నారు. వివరాలకు 7799376111నెంబర్లో సంప్రదించాలని కోరారు.
