సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గొల్లప్రోలులో అభివృద్ధి పనులకు నేడు, సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్టంలో పెరిగిపోతున్న ఆడపిల్లలపై అరాచకాలపై రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అభిప్రాయ పడ్డారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని కోరారు.. పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరిస్తూ సంకేతాలు పంపారు..మనం చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని అన్నారు .మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకుని వచ్చేలా వ్యవహరిస్తున్నారు. నేను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకు అని’ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. డీజీపీ ఇంటిలెజెన్స్ అధికారులు ఎం చేస్తున్నారు?బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. నాకు డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వసతి గృహాల్లో ఉండే అమ్మాయిలను కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు?.ఇసుకలో ఎంత వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ?తప్ప ఇలాంటి వాటిపై దృష్టిసారించడం లేదు అని’ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
