సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జూనియర్ NTR నటించిన ‘దేవర’ (Devara) చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 ప్లస్ కోట్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..దర్శకుడు కొరటాల శివ మరల పాన్ ఇండియా స్థాయిలో పామ్ లోకి వచ్చాడు. అలాగే సోలో హీరోగా భీమవరం లో ఎన్టీఆర్ హీరోగా దేవర ఇప్పటికే 1కోటి 52 లక్షల గ్రాస్ సాధించి ఆయన కెరీర్ లో రికార్డు సాధించింది. ప్రస్తుతం కిషోర్ మినీ లో ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 10 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి పెరుగుతోంది. దేవర సినిమా ఓటీటీ హక్కులను అన్ని భాషల్లోనూ ఒకే దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నవంబర్ 8 నుండి ఈ సినిమాని స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించారు… అంటే మరో 3 రోజులలో ఓటిటి లో చూసెయ్యవచ్చు..
