సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు సర్కార్ మరో వారం రోజుల్లో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయనుంది. రాష్ట్రంలో టీడీపీ జనసేన, బీజేపీ పార్టీల నేతలకు ఏ నిష్పత్తి లో పదవుల పంపకం జరుగుతుందో ఎవరికీ కీలక పదవులు దక్కుతాయో మరో 7 రోజులలో తేలిపోనుంది. అయితే గతంలో మొదటి జాబితాలో ప్రకటించిన పోస్టుల కంటే రెండో జాబితాలో రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని టీడీపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కులాల కార్పొరేషన్లు కు సుమారు 35 వరకు చైర్మెన్ లు పదవులు ఈ విడతలో భర్తీ చేస్తారని భావిస్తున్నారు. వీటితో పాటు మార్కెట్ యార్డ్ తదితర మరికొన్ని ఇతర కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతారు. దీనిపై గత బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు 5 గంటలు పైగా సమీక్షా చేసినట్లు తెలుస్తుంది. పదవుల పొందినవారి లిస్ట్ ఈ నెల 11నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలోపు ప్రకటించే అవకాశముంది. ఉన్న కులాలకు తోడు మరిన్ని కులాలకు సంబంధించి అదనంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే స్వర్ణకార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.
