సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో నాలుగోవా రోజు కూడా ఐటీ సోదాలు (IT Rides) కొనసాగుతున్నాయి. గత బుధవారం నుండి సోదాలు కొనసాగుతున్నాయి.. నిన్న నేడు కూడా గ్రంధి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాములుగా భావిస్తున్న వారి ఇళ్లల్లోనూ కూడా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.. 7 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆక్వా ఇతర వ్యాపారాలకు సంబంధించి రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం నుండీ ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు 3రోజులు గా కొనసాగుతున్నాయి. కేంద్ర పోలీసు బలగాల భద్రత నడుమ ఐటీ అధికారులు భీమవరంలోని గ్రంధి ఇంటికి చేరుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
