సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతో పుణ్యఫలమని, స్వామివారి పవిత్రోత్సవాలలో పాల్గొనడం భగవంతుని అనుగ్రహమేనని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జెపి రోడ్డులోని శ్రీపద్మవతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి పవిత్రోత్సవాలలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు, అలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు పర్యవేక్షణలో శ్రీమాన్ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద చార్యులు ఆధ్వర్యంలో స్వామివార్లకు, అమ్మవార్లకు పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేద మంత్రాలతో పూజలను నిర్వహించి వేదాశీర్వచనలను అందించి ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. అలయ ఈవో సత్యనారాయణ రాజు మాట్లాడుతూ మూడురోజులుగా శ్రీవారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని, పూర్ణాహుతితో స్వామివారి పవిత్రోత్సవాల కార్యక్రమాలు ముగిసాయని తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఈనెల 13న క్షీరాబ్ది ద్వాదశి ధాత్రి తులసి అర్చన, 30న లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
