సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో (నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలైంది. నేడు, శనివారం ఉదయం నామినేటెడ్ పదవుల సెకెండ్ జాబితాను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం (AP Govt) విడుదల చేసింది. మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. .నామినేటెడ్ పదవుల జాబితాలో బీసీలకు అగ్రతాంబూలం అందింది. అలాగే పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి నర్సాపురం కు చెందిన ఎండీ షరీఫ్, అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ లభించింది. కాపు కార్పొరేషన్ చైర్మెన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ గా భీమవరం కు చెందిన జనసేన రాష్ట్ర నేత వి. సూర్యనారాయణ రాజు (కనకరాజు సూరి) కు కీలక పదవులు పొందారు. టీడీపీ నుంచి పట్టాభి , ఉండవల్లి శ్రీదేవి, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాస్, కొ కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. అలాగే బీజేపీ నుంచి మట్టా ప్రసాద్‌కు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను కేటాయించింది. అలాగే గండి బాబ్జి, గొట్టిముక్కల రఘురామరాజు, ఆనం వెంకటరమణారెడ్డి, విజయకృష్ణ రంగారావు, కిడారి శ్రావణ్, ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావులకు కూడా కార్పొరేషన్ పదవులు వరించాయి.
